Sadaa about jayam movie
Sadaa : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సదా గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసింది హీరోయిన్ సదా. జయం సినిమాతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ హీరోయిన్ సదా.. మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకొని టాలీవుడ్ చిత్ర పరిశ్రమను షేక్ చేసింది.
ఈ సినిమా తర్వాత ఏకంగా విక్రమ్ హీరోగా చేసిన అపరిచితుడు సినిమాలో ఛాన్స్ కొట్టేసి… మరో బంపర్ విజయాన్ని అందుకుంది. దీంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళ చిత్ర పరిశ్రమలో సదాకు క్రేజ్ భారీగా పెరిగిపోయింది. అయితే ఆ తర్వాత వచ్చిన సదా సినిమాలు పెద్దగా హిట్ కాలేదు.

దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర పరిశ్రమలలో కూడా హీరోయిన్ సదా కెరీర్ ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న హీరోయిన్ సదా… ఈటీవీ మరియు మా టీవీ లలో ప్రసారమయ్యే షో లకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు సదా. ఇది ఇలా ఉండగా హీరో నితిన్ మరియు సదా కాంబినేషన్లో వచ్చిన సినిమా జయం అన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో విలన్ గా గోపీచంద్ నటించిన అందరినీ మెప్పించాడు. అయితే ఈ సినిమాలోని ఓ సీన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గోపీచంద్ కు కనిపించకుండా… హీరోయిన్ సదాను ఈ సినిమాలో హీరో నితిన్ గుళ్లో కలుస్తాడు. అయితే ఆ విషయం గోపీచంద్ కు తెలియడంతో… గుడికి వచ్చి నితిన్ ను దారుణంగా కొడతాడు. అనంతరం సదా చెంపను నాకుతాడు విలన్ గోపీచంద్. అయితే ఈ సీన్ తనకు నచ్చలేదు అని హీరోయిన్ సదా ( Sadaa ) మొత్తుకున్న… దర్శకుడు బలవంతంగా చేయించాడట.