Shraddhas boyfriend photos viral
Shraddha Das : టాలీవుడ్ అలనాటి హీరోయిన్ శ్రద్ధ దాస్ గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేసి క్రేజీ హీరోయిన్గా మారిపోయింది శ్రద్ధదాస్. అయితే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమంలోనే కాకుండా… ఇతర భాషలలో కూడా ఈ బ్యూటీ ని ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో గ్లామర్ ను నమ్ముకున్న హీరోయిన్ శ్రద్ధ దాస్… సోషల్ మీడియాలో తన అందచందాలను ఆరబోస్తూ యూత్ గుండెల్లో గుణపాలు దించుతోంది.

సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరోయిన్ శ్రద్ధాదాస్… మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడం విశేషం. ఆ తర్వాత మెయిన్ హీరోయిన్ గా కాకుండా… సైడ్ హీరోయిన్ పాత్రలో ఎక్కువగా కనిపించింది. ముఖ్యంగా తెలుగులో వచ్చిన అధినేత, ఆర్య 2,మరో చరిత్ర, నాగవల్లి, డార్లింగ్, బందిపోటు, మొగుడు, గుంటూరు టాకీస్ లాంటి ఎన్నో సినిమాలు చేసింది హీరోయిన్ శ్రద్ధాదాస్.
తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇతర భాషలలో కూడా ఈ బ్యూటీ దాదాపు 30 సినిమాల వరకు చేసింది. ఇది ఇలా ఉండగా తాజాగా హీరోయిన్ శ్రద్ధ దాస్ తన బాయ్ ఫ్రెండ్ తో చనువుగా ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి. తాజాగా వైట్ డ్రెస్ వేసుకొని సోషల్ మీడియాలో ఫోటోలను రిలీజ్ చేసింది శ్రద్ధాదాస్.
ఈ ఫోటోలలో ఓ యువ నటుడితో చాలా చనువుగా కనిపించింది. ఆ యువ నటుడు ఎవరో కాదు అభితేష్ ద్వివేది. అయితే వీరిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో… శ్రద్ధా దాస్ ( Shraddha Das ), ఆమె బాయ్ ఫ్రెండ్ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కొంతమంది అంటూన్నారు.