Tamannaah Loves Tamil Hero
Tamannaah : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్కీ బ్యూటీ తమన్నా గురించి అలాగే ఆమె చేసిన సినిమాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మిల్కీ బ్యూటీ తమన్న ఇండస్ట్రీ లోకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతోంది. ఈ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పటికీ మిల్కీ బ్యూటీ తమన్నకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు.
కుర్ర హీరోయిన్లతో పోటీ పడుతూ మరి ఇండస్ట్రీలో దూసుకుపోతుంది హీరోయిన్ తమన్నా. భాషతో సంబంధం లేకుండా బాలీవుడ్ , టాలీవుడ్ మరియు తమిళ చిత్ర పరిశ్రమంలో వరుసగా సినిమా చేసుకుంటూ ముందుకు సాగుతోంది. పాత్రతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రలైనా చేసేందుకు సిద్ధమవుతోంది. వెబ్ సిరీస్లలో కూడా మిల్కీ బ్యూటీ తమన్న మెరిసింది.

బాలీవుడ్ చిత్ర పరిశ్రమంలో ఇటీవల కాలంలో వెబ్ సిరీస్లలో మెరిసి… తన హాట్ అందాలను ఆరబోసింది మిల్కీ బ్యూటీ తమన్న భాటియా. ప్రస్తుతం బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమలో మునికి తేలుతోంది మిల్కీ బ్యూటీ తమన్న భాటియా. అయితే ఈ తరుణంలోనే మిల్కీ బ్యూటీ తమన్న గురించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమించడం కంటే ముందు… తమిళనాడు కార్తీనీ తమన్నా ( Tamannaah ) భాటియా లవ్ చేసిందట. వీరిద్దరూ ఆవారా సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారట. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయి… ఎవరి లైఫ్ వారు చూసుకున్నారట.