
Sreeleela: చాలా మంది ఇండస్ట్రీకి పెద్ద హీరోయిన్ (sree leela) అవ్వాలని కలలు కని వస్తూ ఉంటారు కానీ అనుకున్నంత మాత్రం అది అందరికీ సాధ్యం కాదు. అవకాశాలు రాక చాలా మంది కెరియర్ స్టార్టింగ్ లో చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటారు. వచ్చిన చిన్న పాత్రలు కూడా వదులుకోకుండా నటిస్తూ ఉంటారు. కానీ శ్రీలీలే మాత్రం వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఓ రేంజ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. వరుస ఆఫర్లు కూడా ఆమె కి వస్తున్నాయి.
శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం చాలా సినిమాలను ఒప్పుకుంది ఆమె షూటింగ్ల తో బిజీ వుంది. ఇదిలా ఉంటే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 ప్రధానోత్సవం వేడుక దుబాయ్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఉత్తమ నటిగా శ్రీలీలా ఎంపికైంది ధమాకా సినిమాలో నటన కి ఆమెకి అవార్డు లభించింది.
అంతకుముందు రెడ్ కార్పెట్ మీద కూడా ఈమె తళుక్కు మెరిసింది వైలెట్ కలర్ డ్రెస్ లో జిగేల్ అనిపించింది ఈ ముద్దుగుమ్మ. శ్రీ లీల అందాన్ని చూస్తే ఎవరైనా ఫిదా అవుతారు ఈ ఫొటోస్ ని చూస్తే ఎవరికైనా నచ్చేస్తుంది. వైలెట్ కలర్ డ్రెస్ లో చాలా అందంగా కనబడుతోంది. ఈమె అందాన్ని చూస్తే ఎవరికైనా శ్రీ లీల నచ్చుతుంది. వావ్ అంటారు.
తెలుగులో శ్రీ లీల (Sreeleela) పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ గోల్డెన్ లెగ్ ఏ సినిమాల్లో నటించిన ఆ సినిమాకి మంచి పేరు వస్తూనే వుంది. శ్రీ లీలకి కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి రెడ్ కార్పెట్ మీద ఈమె నడుస్తుంటే కెమెరాలన్నీ కూడా ఆమె వైపు ఆటోమేటిక్గా తిరిగిపోయినట్లే ఆమె ఉంది.