Vijay Antony: విజయ్ ఆంటోని కూతురు చివరగా మాట్లాడిన.. ఆ వ్యక్తి ఎవరు..?

బిచ్చగాడు సినిమాతో విజయ్ అంటోనీ (Vijay Antony) పాపులర్ అయ్యారు. విజయ్ అంటోని అందరికీ సుపరిచితమే మంచి నటుడుగా దర్శకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్ ఆంటోని. చివరిసారిగా బిచ్చగాడు టూ లో కనపడ్డారు విజయ్ అంటోని. అయితే విజయ్ అంటోని కూతురు ఈరోజు తెల్లవారుజామున మూడు గంటలకి చనిపోయిన విషయం తెలిసిందే ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇక వివరాలను చూస్తే ఈరోజు తెల్లవారుజాము మూడు గంటలకి విజయ్ ఆంటోనీ కూతురు చనిపోయారు.

ఆమె ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలుస్తోంది అయితే ఆత్మహత్యకి గల కారణాలు ఏంటి అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు అన్ని రంగాలలో కూడా విజయ్ అంటోనీకి ప్రావీణ్యం ఉంది. ఇదివరకు ఆయన సూసైడ్ గురించి మాట్లాడారు పిల్లల్ని ఒత్తిడి చేయకూడదని ఒత్తిడికి గురైతే పిల్లలకి ఇటువంటి ఆలోచనలు వస్తాయని చాలామంది తల్లిదండ్రులు పిల్లలపై రుద్దుతారని వాళ్లు చదువుకోలేక ఒత్తిడికి గురై ఇలాంటివి చేస్తూ ఉంటారని చెప్పారు విజయ్.

ప్రస్తుతం విజయ్ ఆంటోని చెప్పిన ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. విజయ్ అంటోనీ కూతురు లారా ఇలా చేయడం తో ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీలోనే కాదు తెలుగు ఇండస్ట్రీలో కూడా కలకలం రేపుతోంది. విజయ్ అంటోని తన కూతురు గదిలోకి వెళ్లి చూడగా ఆమె ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది షాక్ అయిపోయారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పేశారు.

విజయ్ ఆంటోనీ కూతురు డిప్రెషన్ తో బాధపడుతోందని గత కొన్ని రోజులుగా మందులు వాడుతోందని తెలిసింది ఆమె స్నేహితులని పోలీసులు విచారిస్తున్నారు అయితే ఆమె చివరిసారి ఎవరితో మాట్లాడింది ఫోన్లో ఎవరితో మాట్లాడింది అనే విషయాలని పోలీసులు పరిశీలిస్తున్నారు. మరి అప్పుడు ఏమైనా విషయాలు తెలియచ్చు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.