Samantha: నేను కూడా అనుకోలే.. నా లైఫ్ లో అదే అయింది అంటూ సమంత సెన్సేషనల్ కామెంట్స్…!!

samantha

Samantha: నటి సమంత (Samantha) గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సమంత సినిమాతో మంచి హిట్స్ ని కొట్టేసింది. సమంత తాజాగా ప్రస్తుత పరిస్థితి గురించి ఫ్యూచర్ ప్రాజెక్ట్ ల గురించి చెప్పుకొచ్చారు ఈమె యువతకి సందేశాన్ని ఇచ్చి విధంగా ట్రై చేశారు జీవితంలో పాటించే మూడు సూత్రాలని సమంత చెప్పారు. నెటిజెన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా ఆమె సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఇవి వార్తల్లో వైరల్ అవుతున్నాయి అలానే తన ఫ్రెండ్ వెన్నెల కిషోర్ కు లవ్ యు ఫర్ ఎవర్ అని చెప్పారు.

సమంత ఇంకా ఏది ఫిక్స్ అవ్వలేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఎలాంటి ప్లాన్స్ కూడా లేవు అని సమంత చెప్పింది. నాకు కంఫర్ట్ జోన్ కి అవతల ఉండే సినిమాలే చేస్తాను అని సమంత చెప్పింది. యాక్షన్ అడ్వెంచర్లు చేయాలని ఉందని కూడా ఆమె చెప్పింది అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు సిటాడెల్ లో ఉన్నాయని షూటింగ్ చేయడం ఎంతో కష్టంగా అనిపించింది కానీ ఎంతో ఇష్టంగా షూటింగ్ చేశాను అని సమంత చెప్పింది.

ఏం జరిగినా దాని గురించి బయటకు రావాలి ప్రశ్నించడం మానేయాలి ఏం జరుగుతుందో అదే జరుగుతుంది అనేది సమంత పాటిస్తుంది. నిజాయితీ సత్యం తో ముందుకు వెళ్లాలని సమంత చెప్పింది. అదే తాను పాటిస్తున్నట్టు చెప్పింది అలానే యూత్ తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా ఉండేందుకు ఏమైనా సలహాలు సూచనలు ఇవ్వండి అని అడిగితే.. నాకు నా జీవితం ఇంతే అయిపోయింది దేవుడా అని బాధపడుతుంటారు చాలామంది.

కానీ అది మీకు జరిగే నష్టం కానే కాదు అలాంటప్పుడే మీ జీవితం మొదలైనట్లు అని చెప్పింది సమంత. అలానే వెళ్లి దారిలో ఎన్నో అడ్డంకులు కష్టాలు వస్తాయి తప్పవు వాటిని ఎదుర్కోవాలి అని సమంత చెప్పింది స్ట్రాంగ్ గా ధైర్యంగా ఒకప్పుడు ఉండేదని కాదు జీవితమంటే అదే అంటూ సమంత చెప్పింది.