
Janhvi Kapoor: జాన్వీ కపూర్ శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీ లోకి వచ్చి.. మూవీస్ చేస్తూ వుంది. తన (Janhvi Kapoor) నటన తో మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఈ భామ. జాన్వీ ధడక్ సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. అది హిట్ కావడం తో జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ అవకాశాలని పొందింది. తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తూ ఉంటుంది.
ఈ హీరోయిన్ హిందీలో వరుస సినిమాలు చేస్తూన్న సరైన బ్రేక్ రాలేదు.
ఎన్టీఆర్, కొరటాల శివ (koratala shiva) దేవర మూవీ లో హీరోయిన్‌గా నటిస్తోంది ఈమె. అలానే ఈమెకి కోలీవుడ్‌లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఎప్పటినుండో ఈమె తెలుగు సినిమాలు చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. ఎట్టకేలకి ఈమె ఎన్టీఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులు ముందుకు రాబోతోంది. మరోవైపు సినిమాలు చేస్తూ వరుస ఫోటో షూట్లతో కూడా అందర్నీ మెప్పిస్తూ ఉంటుంది. లేటెస్ట్ ఫోటోస్ ని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. అయితే త్వరలో మంచి కథ దొరికితే ఈమె తెలుగు సహా దక్షిణాది భాషల్లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. వరుసగా తెలుగు సినిమాలు చేయడానికి కూడా ఈమె రెడీగా ఉంది.
ప్రస్తుతం అయితే ఎన్టీఆర్ సినిమాలో కథానాయక నటించబోతోంది శ్రీదేవి కూతురు జాన్వి. ఇక ఈమె ఫోటోషూట్ల విషయానికి వస్తే ఈ రోజుల్లో చాలా మంది హీరోయిన్లు హీరోలు వాళ్ళ ఫొటోస్ ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటున్నారు. అలానే ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు ఇస్తూ ఉంటున్నారు. జాన్వీ కపూర్ కూడా తన అందాలని చూపిస్తూ కొన్ని ఫొటోస్ ని వదులుతూ ఉంటుంది. ఈమె అందం చూస్తే ఖచ్చితంగా యువత పిచ్చెక్కి పోవాల్సిందే.
తన అందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది లేటెస్ట్ ఫోటోస్ అయితే విపరీతంగా వైరల్ అవుతున్నాయి జాన్వి కపూర్ చాలా అందంగా ఉంది. గోల్డ్ కలర్ చీరలో ఈమె అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇక దేవర సినిమా తో జాన్వి కపూర్ మంచి హిట్ కొడుతుందా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కనుక ఈమె ఈ సినిమాతో సక్సెస్ అయితే ఇక తెలుగులో మంచి ఆఫర్లు వస్తాయి అందులో డౌట్ లేదు మరి జాన్వి కపూర్ కి కలిసి వస్తుందా లేదా అనేది చూడాలి.