Rashmika Chance With Ravi Teja In Gopichand Malineni Direction Latest Telugu News
Rashmika Mandanna : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నప్పటికీ కన్నడ బ్యూటీ రష్మిక మందానకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది హీరోయిన్ రష్మిక మందాన. కర్ణాటకలో పుట్టి పెరిగిన హీరోయిన్ రష్మిక మందాన మొదట… కన్నడలో నిరూపించుకొని ఆ తర్వాత తెలుగులో అడుగు పెట్టింది.
తెలుగులో రష్మిక మందాన మొట్టమొదటిగా చేసిన సినిమా చలో. చలో సినిమాలో నాగశౌర్య హీరోగా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా చేయగా రష్మిక మందాన హీరోయిన్గా నటించి అందరిని మెప్పించింది. తమిళనాడు బార్డర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అందుకుంది.

ఆ తర్వాత హీరోయిన్ రష్మిక మందాన క్రేజ్ ఎక్కడికో వెళ్ళింది. టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ మరియు కోలీవుడ్ చిత్ర పరిశ్రమలలో కూడా రాణిస్తోంది రష్మిక మందాన. ఈ తరుణంలోనే హీరోయిన్ రష్మిక మందానకు అదిరిపోయే ఆఫర్ వచ్చింది. టాలీవుడ్ సీనియర్ హీరో మాస్ మహారాజు రవితేజ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుందట రష్మిక మందాన.
గోపీచంద్ మలినేని మరియు మాస్ మహారాజు రవితేజ కాంబినేషన్లో ఇప్పటికే రెండు బంపర్ హిట్లు వచ్చాయి. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీలాను మొదట అనుకున్నారట. కాని చివరికి శ్రీ లీల హ్యాండ్ ఇచ్చిందట. దీంతో ఆమె స్థానంలో రష్మిక మందానను తీసుకోవాలని అనుకుంటున్నారట. అటు రవితేజ తో స్క్రీన్ పంచుకోవాలని రష్మిక మందనా ( Rashmika Mandanna ) తెగ ఆత్రుతగా ఉందని కూడా సమాచారం.