Manchu Lakshmi: మంచు లక్ష్మి గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. మంచు లక్ష్మి (Manchu Lakshmi) సినిమాల ద్వారా పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు, కానీ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి వచ్చి అందరికీ కొంచెం తెలిసింది. సోషల్ మీడియాలో ఆమెపై ఎక్కువగా ట్రోలింగ్స్ వస్తూ ఉంటాయి ఆమె ఇంగ్లీష్ భాష మీద ఇంటర్వ్యూలు మీద నెట్టింట విపరీతంగా మీమ్స్ వస్తూ ఉంటాయి. బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతుంది మంచు లక్ష్మి.
ఇప్పుడు బీజేపీ లో జాయిన్ అవుతున్నారు అంటూ ఆమె మీద రూమర్లు విపరీతంగా షికార్లు కొడుతున్నాయి. దానికి తగ్గట్టుగా మంచు లక్ష్మి కూడా ఢిల్లీలో ఉన్నట్లుగా ట్విట్ చేసింది ఇది ఇలా ఉండగా లక్ష్మీ మంచు వీడియో ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దుబాయ్ లో జరిగిన సైమా వేడుకల్లో మంచు లక్ష్మి కూడా సందడి చేసింది.
తెలుగు చిత్ర పరిశ్రమ నుండి చాలామంది సెలబ్రిటీలు సైమా వేడుకకి వెళ్లారు మంచు లక్ష్మి కూడా వెళ్లారు. సైమా వేడుకలకు ఎన్టీఆర్ మొదలు చాలా మంది నటులు వెళ్లారు ఈ అవార్డు వేడుకలకి లక్ష్మీ మంచి కూడా వెళ్ళింది. అయితే మీడియా మాట్లాడుతూ ఉంటే ఒక వ్యక్తి ఆమెకి అడ్డు వచ్చాడు.
అడ్డు వచ్చిన వ్యక్తి మీద ఒక దెబ్బ వేస్తూ.. నీ అని ఆపేసింది. దాంతో అక్కడ యాంకర్ ఆ వీడియోని తీసేయండి కట్ చేయండి అంటే వద్దు ఉంచండి అని మంచు లక్ష్మి అంది ఇంతలో ఇంకో వ్యక్తి అడ్డు రాబోయేడు జరుగు అన్నట్లుగా ఏదో చెప్పబోయింది మంచు లక్ష్మి ఇలా దురుసుగా ప్రవర్తిస్తూ నవ్వేసింది. ప్రస్తుతం మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ ఫన్నీ వీడియో వైరల్ అవుతోంది.