Nayanthara before coming into movies:
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నయన తార అద్భుతంగా నటిస్తూ అందరినీ ఆకట్టుకుంది. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార జర్నీ గురించి ఎంత చెప్పినా, ఏం చెప్పినా తక్కువే. ఈమె తన నటనతో అందరినీ ఆకట్టుకుంటూ అవకాశాలని బాగా సంపాదించుకుంటూ వచ్చింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది నయనతార. నయనతార కి సంబంధించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో బుల్లితెర యాంకర్ గా దర్శనమిచ్చింది నయనతార. నయనతార ఒక మలయాళ టీవీ ఛానల్ లో యాంకర్ గా ఒక ప్రోగ్రాం చేసేదట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతోంది. నయనతార వీడియోలో మాట్లాడుతున్న రూపం ఆమె మాట్లాడే తీరు అందర్నీ బాగా ఆకట్టుకుంది. నయనతార అసలు పేరు నయనతార కాదట. ఆమె అసలు పేరు డయానా.
ఆమె ఫస్ట్ మూవీ మనసేనక్కరే సినిమా దర్శకుడు ఆమె పేరుని నయనతార కింద మార్చరట. ఇక పేరు మార్చుకున్నాక క్రేజ్ మామూలుగా లేదు. ఓ రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. తెలుగులో గజిని సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనపడి నయనతార ఆకట్టుకుంది.
చంద్రముఖిలో కూడా నయనతార నటించిన తర్వాత చాలా తెలుగు సినిమాల్లో నయనతార కనబడి అందరిని ఆకట్టుకుంది. అయితే సినిమాల్లోకి రాకముందు నయనతార ఒక షో కి యాంకర్ గా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ప్రస్తుతం నయనతార సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి అందరూ ఈ విషయాల గురించి చర్చించుకుంటున్నారు.