Nithya Menen Harassment News Is Fake
Nithya Menen : టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో నిత్యామీనన్ కూడా ఒకరు. 35 సంవత్సరాల దాటినప్పటికీ హీరోయిన్ నిత్యామీనన్… ఏమాత్రం యంగ్ హీరోయిన్ కు తీసిపోకుండా ఉంటుంది. బొద్దుగా, కాస్త లావుగా ఉన్నప్పటికీ హీరోయిన్ నిత్యమీనన్కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. ఆమె కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు హీరోయిన్ నిత్యమీనన్కు ఇండస్ట్రీలో వరుసగా చాన్సులు వస్తూనే ఉన్నాయి.
కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన హీరోయిన్ నిత్యమీనన్ మొదట సింగర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఆ తర్వాత హీరోయిన్ గా సెటిల్ అయిపోయింది. 2008 సంవత్సరంలో ఆకాశ గోపురం అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ హీరోయిన్ నిత్యమీనన్.

అయితే అలా మొదలైంది సినిమాతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది నిత్యమీనన్. 2011 సంవత్సరంలో అలా మొదలైంది సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇష్క్, జనతా గ్యారేజ్ గుండెజారి గల్లంతయిందే జబర్దస్త్ గీతగోవిందం లాంటి ఎన్నో సినిమాలలో ఛాన్సులు కొట్టేసింది హీరోయిన్ నిత్యామీనన్.
అయితే తాజాగా శ్రీమతి కుమారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నిత్యామీనన్ సిద్ధమైంది. ఈ తరుణంలోనే ఒకానొక సమయంలో ఓ తమిళ హీరో తనను లైంగికంగా వేధించాడని నిత్యామీనన్ చెప్పినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆ తమిళ హీరో ఎవరు అని అందరూ సెర్చ్ చేస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని నిత్యామీనన్ ( Nithya Menen ) పేరుతో మరో పోస్టు వైరల్ గా మారింది. దీంతో జనాలు పిచ్చోళ్ళు అవుతున్నారు.