Samantha, Ramcharan, Sukumar combination
Samantha : అక్కినేని నాగచైతన్య మాజీ భార్య, టాలీవుడ్ టాప్ మోస్ట్ హీరోయిన్ సమంత గురించి మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి కాకుండా… దేశవ్యాప్తంగా మంచి పాపులారిటీ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ హీరోయిన్ సమంతకు ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గిపోదు. అప్పట్లో సౌందర్య లాగే హీరోయిన్ సమంతకు మంచి ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఆమె ఏది చేసిన జనాలకు… మంచి లానే కనిపిస్తుంది.
అయితే ఏం మాయ చేసావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ సమంత… మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకుంది. దీంతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అలాగే దానికి తగ్గట్టుగానే హీరో అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది హీరోయిన్ సమంత. దాంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే అగ్ర హీరోయిన్గా ఎదిగిపోయింది.

అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన హీరోయిన్ సమంత ప్రస్తుతం ఒంటరి జీవితాన్ని అనుభవిస్తుంది. వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగిస్తోంది తన జీవితాన్ని…! ఈ నేపథ్యంలోనే హీరోయిన్ సమంతకు సంబంధించిన ఓ న్యూస్ ఫైనల్ గా మారింది. మెగా హీరో రామ్ చరణ్ తో మరోసారి హీరోయిన్ సమంత సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు హీరోయిన్ సమంత కాంబినేషన్లో ఇప్పటికే రంగస్థలం సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించారు. అయితే రంగస్థలం పార్ట్ 2 చేసేందుకు సుకుమార్ సిద్ధమయ్యారట. ఈ మేరకు మొదటగా సమంత ( Samantha ) తో చర్చలు జరపగా… తను సరే అని చెప్పిందట. ఇక రాంచరణ్ తో చర్చలు జరిపి ఈ ప్రాజెక్టు ఫైనల్ చేయనున్నారట సుకుమార్.