Tollywood Heros Trying To Marriage Sharwanand Wife
Sharwanand : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ యంగ్ హీరోలలో కేవలం కొంతమందికి మాత్రమే స్టార్ డం వచ్చింది. అలా అతి తక్కువ కాలంలోనే స్టార్ డం తెచ్చుకున్న హీరోలలో శర్వానంద్ ఒకడు. మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ పలుకుబడితో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదుగుతున్నాడు శర్వానంద్.
హీరో శర్వానంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన శర్వానంద్… గమ్యం సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నాడు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేసినప్పటికీ… గమ్యం సినిమాతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక లేటెస్ట్ గా ఒకే ఒక జీవితం అనే సినిమాతో చివరిసారిగా మంచి విజయాన్ని అందుకున్నాడు శర్వానంద్.

ఇక ఈ టాలీవుడ్ హీరో శర్వానంద్ ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణకు చెందిన రక్షిత రెడ్డి అనే అమ్మాయిని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నాడు శర్వానంద్. హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి గారి అమ్మాయి అయినా రక్షిత రెడ్డిని హీరో శర్వానంద్ పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి వివాహం రాజస్థాన్లో జరిగింది.
అయితే శర్వానంద్ పెళ్లి చేసుకోక ముందు… రక్షిత రెడ్డిని పెళ్లి చేసుకోవాలని టాలీవుడ్ హీరోలు చాలామంది ట్రై చేశారట. పెళ్లిచూపులలో భాగంగా రక్షిత రెడ్డిని చాలామంది టాలీవుడ్ హీరోలు చూశారని సమాచారం. కానీ అందులో శర్వానంద్ ( Sharwanand ) మాత్రమే తనకు నచ్చాడని అక్షిత రెడ్డి చెప్పిందట. దీంతో వీరిద్దరి వివాహం జరిగింది.