Sneha Relation With Producer
Sneha : మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా అలనాటి హీరోయిన్లు మాత్రం తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఇప్పటికి నిలిచిపోతారు. అందులో హీరోయిన్ స్నేహ ఒకరు. సంక్రాంతి రాధాగోపాలం శ్రీరామదాసు ఇలా ఎన్నో సినిమాలు చేసి ఫ్యామిలీ హీరోయిన్ల గుర్తింపు తెచ్చుకుంది స్నేహ. సింపుల్గా చెప్పాలంటే దివంగత హీరోయిన్ సౌందర్య లాగా… ఆమె స్థానాన్ని స్నేహ భర్తీ చేసిందని చెప్పవచ్చు.
టాలీవుడ్ సీనియర్ హీరోలు అందరి సరసన వరుసగా సినిమాను చేసి అప్పట్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది స్నేహ. హీరోయిన్స్ స్నేహ చేసిన సినిమాలు దాదాపు బంపర్ విషయాన్ని అందుకున్నాయి. 2001 సంవత్సరంలో కెరీర్ ప్రారంభించిన స్నేహ ప్రస్తుతం పెళ్లి చేసుకుని లైఫ్ ఎంజాయ్ చేస్తోంది.

తొలివలపు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ స్నేహ… మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తొట్టెంపూడి గోపి సరసన నటించి అందరిని మెప్పించింది. ఆ తర్వాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు మరియు సంక్రాంతి లాంటి ఫ్యామిలీ సినిమాలు చేసి సంచలనమే సృష్టించింది.
ఇక 2012 సంవత్సరంలో ప్రసన్న తో స్నేహ వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాజా సమాచారం మేరకు ప్రసన్న కంటే ముందు ఓ నిర్మాతను స్నేహ ప్రేమించిందట. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే స్నేహ ( Sneha) ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లి క్యాన్సిల్ అయిందని సమాచారం.