ChatGPT New features:

ChatGPT: ఈరోజుల లో టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది టెక్నాలజీ (ChatGPT) బాగా అభివృద్ధి చెందడం తో అనేక మార్పులు వస్తున్నాయి. టెక్నాలజీ పెరిగి పోవడం తో మన పనులు కూడా సులభం అయిపోతున్నాయి. ఇంతలా అడ్వాన్స్ టెక్నాలజీ తో కూడుకున్న చాట్ జీపీటీ సేవలు అందుబాటు లోకి వచ్చేసి ఏడాది అయిపోతుంది. ఈ సందర్భంగా ఇందులో కొని అధునాతన ఫీచర్ల ని జోడించడం జరిగింది ఈ కొత్త ఫీచర్ల తో చాట్ జీపీటీ ఇంకా అత్యాధునికంగా మారనుంది.
ఇక పై చాట్ జీపీటీ ChatGPT తో యూజర్లు నేరుగా మాట్లాడి సందేహాలని తీర్చుకోవడానికి అవుతుంది. ఇదొక్కటే కాకుండా, ఇమేజ్ రూపంలో కమాండ్ ని సెట్ చేసి సేవల ని కూడా పొందవచ్చు ఇక దీని గురించి పూర్తి వివరాలు చూసేద్దాం. మరి ఆసక్తికరమైన విషయాలని ఎటువంటి ఆలస్యం లేకుండా చూసేయండి.

ఇప్పటి దాకా చూస్తే చాట్ జీపీటీ లో కేవలం టెక్ట్స్, వాయిస్ రూపం లోనే సందేహాలు అడిగే ఛాన్స్ ఉంది. అప్పుడు జీపీటీ ఈ ప్రశ్నలకు టెక్ట్స్ రూపం లోనే సమాధానం ఇస్తూ వుంది. ఈ జవాబు ఇచ్చే దాకా కూడా ఇంకో ప్రశ్న వేయడానికి లేదు.
కానీ ఇప్పుడు కొత్త వాయిస్ ఫీచర్ ChatGPT తో వాయిస్ రూపంలో ఏదైనా ప్రశ్నకు అడిగిన వెంటనే చాట్ జీపీటీ సైతం వాయిస్ రూపంలోనే ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇది ఒక్కటే కాకా ఇమేజ్ ద్వారా కూడా మన సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. కావాల్సిన ఫొటోను అప్‌లోడ్ చేసి దానికి సంబంధించి ఏదైనా ప్రశ్నను అడిగితె వెంటనే సమాధానం చెప్పేస్తుంది.