
Xiaomi 12 Pro: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా స్మార్ట్ ఫోన్ (Xiaomi 12 Pro) కి అలవాటు పడిపోయారు. ప్రతి ఒక్కరి చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటోంది. స్మార్ట్ ఫోన్ ఉండడం వలన మన పనులు తేలికగా పూర్తయిపోతూ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్షణంలో డబ్బులు పంపుకోవడం మొదలు ఎన్నో అవసరాలని మనం ఒక స్మార్ట్ ఫోన్ తో తీర్చుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ వలన ఎన్నో లాభాలు ఉన్నాయి కాబట్టే ప్రతి ఒక్కరు స్మార్ట్ఫోన్ వాడుతున్నారు నిజం చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మన పనులు బాగా ఈజీ అయిపోయాయి. అయితే రోజురోజుకీ మార్కెట్లో అనేక రకాల ఫోన్లో వస్తూ ఉంటాయి.
ఎవరికి నచ్చిన వాటిని వాళ్ళు కొనుగోలు చేస్తూ ఉంటారు ఫోన్ కొనేటప్పుడు కచ్చితంగా ఫీచర్లని ప్రతి ఒక్కరు చూస్తాము. ఎవరికీ ఎటువంటి ఫీచర్లు ఉంటే బాగుంటుంది అనేది వారి ఇష్టం అయితే ఈ రోజు మేము మీకు ఈ ఏడాది ప్రారంభంలో రిలీజ్ అయిన షియోమీ 13 ప్రో మొబైల్ గురించి కొన్ని విషయాలని తీసుకువచ్చాము.

ఈ 13 ప్రో ని Xiaomi 12 Pro ఈ ఏడాది స్టార్టింగ్ లో రిలీజ్ చేశారు తర్వాత చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీ పాత ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ షియోమీ 12 ప్రో ధరిని తగ్గించేసింది. ఇప్పుడు ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ద్వారా రెండోసారి బాగా తగ్గింది కొత్త ధర ఎంతో ఇప్పుడు చూసేద్దాం అలానే ఈ ఫోన్ ఫీచర్ల గురించి కూడా ఒక లుక్ వేసేద్దాం. 8GB + 256GB, 12GB + 256GB రెండు వేరియంట్‌లలో వస్తుంది. తగ్గించాక 8GB వేరియంట్ ధర రూ.44,999గా వుంది. 12GB వేరియంట్ ధర రూ.48,999గా ఉండేది.
అదే ఇప్పుడు Xiaomi 12 Pro ప్రీమియం ధర 8GB వేరియంట్‌కు రూ.39,999, 12GB వేరియంట్‌కు రూ.41,999గా వుంది. నలుపు, నీలం కలర్స్ లో అందుబాటులో వున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.73-అంగుళాల తో వస్తుంది WQHD+ AMOLED డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్ వున్నాయి. 12 ఆధారిత MIUI 13 వంటి లక్షణాలను కలిగి ఉంది. ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో కెమెరా, 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ 4600mAh . 24 నిమిషాల్లో ఛార్జ్ అయిపోతుంది.