Gas Cylinder Price : కేంద్రం భారీ షాక్‌.. గ్యాస్‌ సిలిండర్ల ధరలు భారీగా పెంపు

Gas Cylinder Price
Gas Cylinder Price

Gas Cylinder Price

Gas Cylinder Price :  సామాన్యులకు మరోసారి ఊహించని షాక్ ఇచ్చింది కేంద్రంలోని మోడీ సర్కార్. గత కొన్ని రోజులుగా ఇండియాలో సిలిండర్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత… సిలిండర్ ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో సామాన్యులకు సిలిండర్ ధరలు పెనుబారంగా మారిపోయాయి.

అయితే ఇవాళ అక్టోబర్ ఒకటో తేదీ. ఈ నేపథ్యంలో సామాన్యులకు మరోసారి షాక్ ఇచ్చింది కేంద్రంలోని మోడీ సర్కార్. కమర్షియల్ సిలిండర్ ధరలను గత కొన్ని రోజులుగా తగ్గిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం… ఈ నెలలో మాత్రం భారీగా పెంచేసింది. తాజాగా 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను ఏకంగా 209 రూపాయలు పెంచింది కేంద్ర ప్రభుత్వం.

Gas Cylinder Price
Gas Cylinder Price

దీంతో సామాన్యులకు భారీ షాక్ తగిలింది. తాజాగా పెరిగిన ధరల వివరాల ప్రకారం… దేశ రాజధాని అయిన ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర 209 రూపాయలు పెరిగి… 1731.5గా నమోదు అయింది. అలాగే కోల్కతాలో 19 కిలోల సిలిండర్ ధర 1839గా నమోదు అయింది.

చెన్నై నగరంలో 1898గా… ముంబైలో 1684 గా నమోదు అయింది. పెరిగిన ధరలు వెంటనే ఇవాల్టి నుంచి అమలులోకి వస్తాయని చమరు కంపెనీ. అయితే కమర్షియల్ సిలిండర్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల ( Gas Cylinder Price )ను స్థిరంగా ఉంచింది. దీంతో గృహ వినియోగదారులకు భారీ ఊరట లభించింది.