itel launches Indias most affordable 5G smartphone P55 Power 5G under Rs 10K
Mobile Phones : భూమి పైన ఉన్న ప్రతి ఒక్కరికి మొబైల్ ఫోన్ ఉందన్న సంగతి తెలిసిందే. కాలం మారినాకొద్ది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే… చాలామంది వయసుతో సంబంధం స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు.
దీనికి తగ్గట్టుగానే మొబైల్ కంపెనీలు రకరకాల ఫోన్ల ను విడుదల చేస్తున్నాయి. మొన్నటి వరకు ఫోర్ జి ఫోన్ ఉంటే ఎక్కువ. కానీ ఇప్పుడు 5g ఫోన్ వచ్చేసింది. చాలా పట్టణాలలో 5జి నెట్వర్క్ కూడా అందుతుంది. దీంతో చాలామంది 5 జి మొబైల్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఇలాంటి తరుణంలోనే చైనాకు చెందిన ఐటెల్ కంపెనీ రెండు 5జి ఫోన్లను తీసుకోవచ్చేసింది. అందులోనూ పదివేల రూపాయల లోపు దొరికేలా ఒక మొబైల్ ఫోన్లు రూపొందించింది ఐటెల్ కంపెనీ.

ఐటెల్ తీసుకువచ్చిన మొబైల్లలో ఒకటి 10వేలు ఉండగా… మరో మొబైల్ ఫోన్ 15 వేల లోపు ఉంది. ఐటెల్ తాజాగా తీసుకువచ్చిన 5జి ఫోన్ పీ 55 ధర 9999 రూపాయలు మాత్రమే. ఇది కేవలం 8జిబి ram+ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ లో మాత్రమే ఉంటుంది. అక్టోబర్ 4వ తేదీ నుంచి అమెజాన్ లో ఈ ఫోన్లో లభ్యమవుతాయి. దీని బ్యాటరీ 5000amh. అలాగే 50 MP ప్రధాన కెమెరా కూడా ఉంది.
ఇక ఐటెల్ తీసుకు వచ్చిన మరో ఫోన్ ఎస్ 23 +. దీని ద్వారా 13,999. ఈ మొబైల్ ఫోన్ లో 8జిబి ram+ 256 జీబీ స్టోరేజ్ ఉంది. దీని బ్యాటరీ 5000amh. అలాగే ఈ మొబైల్ ఫోన్ ( Mobile Phones ) లో 50 MP ప్రధాన కెమెరా కూడా ఉంది.