BSNL Crazy Offer
Mobile Recharge: ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఫోన్ ఉన్న సంగతి తెలిసిందే. ఎక్కడికి వెళ్లినా కచ్చితంగా అందరు ఫోన్ పట్టుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే… మొబైల్ కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నాయి. ఇక మన దేశంలో ఎక్కువగా రిలయన్స్ జియోను వాడుతున్నారు. కొంతమంది మాత్రమే బిఎస్ఎన్ఎల్ మరియు ఎయిర్టెల్ లాంటి కంపెనీలను వాడుతున్నారు.
ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించేవారు మాత్రం బిఎస్ఎన్ఎల్ లేదా ఎయిర్టెల్ ను వినియోగిస్తున్నారు. అయితే రిలయన్స్ జియోని తట్టుకునేందుకు బిఎస్ఎన్ఎల్ కంపెనీ అనేక ఆఫర్లను ఈ మధ్యకాలంలో ప్రకటిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరో క్రేజీ ఆఫర్ తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ క్రేజీ ఆఫర్ ఒక్కసారి రీఛార్జి చేసుకుంటే… దాదాపు ఆరు నెలల వరకు రీఛార్జ్ మాట ఎత్తకుండా ఉంటాం.

అయితే ఇది 500 రూపాయల లోపు ఉండటం గమనార్హం. కేవలం 498 రూపాయలతో బిఎస్ఎన్ఎల్ కంపెనీ అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. 498 రూపాయలతో బిఎస్ఎన్ఎల్ ప్రత్యేక ప్యాకేజీ వేసుకుంటే 180 రోజులు అంటే ఆరు నెలల పాటు ఉచితంగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఇప్పటివరకు ఏ కంపెనీ ప్రకటించని ఆఫర్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది.
498 రూపాయలతో రీఛార్జ్ చేసుకుంటే… బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ కాల్స్ ఒక్క నిమిషానికి 10 పైసలు మాత్రమే కట్ అవుతుంది. అలాగే ఇతర నెట్వర్క్ లకు 30 పైసలు ఒక్క నిమిషానికి పడుతుంది. అలాగే ఈ ప్లాన్ కారణంగా యూజర్కు వంద రూపాయల టాక్ టైం లభిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ప్యాక్ ను మీ మొబైల్ లో రీఛార్జి ( Mobile Recharge ) చేసుకోండి