Cars under 6 Lakhs
Cars under 6 Lakhs : ప్రస్తుత కాలంలో చాలా మంది రిచ్ లైఫ్ ఎంజాయ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం ఎంత డబ్బు అయినా ఖర్చు చేసి విలాసాలకు అలవాటు పడుతున్నారు. అప్పట్లో ఒక్క ఇంటికి సైకిల్ ఉంటే సరిపోతుందని కాలం నుంచి ఇప్పుడు ప్రతి ఇంటికి కారు ఉండాల్సిందే అని అందరూ అంటున్నారు. కాలం మారినకొద్దీ జనాలు కూడా మారిపోతున్నారు. అయితే ఇలాంటి తరుణంలో సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా కొన్ని కార్లు మార్కెట్లోకి వచ్చాయి. ముఖ్యంగా 6 లక్షల లోపు కొన్ని కార్లు మార్కెట్లోకి విడుదల చేశాయి ఆయా కంపెనీలు. మరి ఆ కార్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మారుతి S ప్రెప్సో
మారుతి సుజుకి కంపెనీకి చెందిన ఈ కారు ధర… షోరూం ప్రకారం నాలుగు లక్షల ఇరవై ఆరువేల 500 రూపాయల నుంచి… 6 లక్షల 11500 వరకు ఉంది. ఇక ఈ కారు మైలేజ్ 25 కిలోమీటర్లు ఇస్తుంది.
హుందాయి ఎక్స్ టర్
హుండాయ్ కంపెనీకి చెందిన ఈ కారు ధర 5,99,999. ఈ కారుకు ఆరు ఎయర్ బ్యాగులు, వాయిస్ కమాండ్ పై పని చేసే సన్డ్రూప్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ కారు 19 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.
టాటా టియాగో
టాటా కంపెనీకి చెందిన ఈ కారు ధర 5 లక్షల 59,000 ల నుంచి ఎనిమిది లక్షల 19 వేల వరకు ఉంది. ఈ కారు మైలేజ్ 26 కిలోమీటర్లు. 6 లక్షల లోపు ఉన్న కార్ల ( Cars under 6 Lakhs )ను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తిని చూపిస్తున్నారు.