Google Pixel Watch 2 : తక్కవ ధరకే గూగుల్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ స్మార్ట్‌వాచ్‌.. ఫీచర్లు ఇవే..!

Google Pixel Watch 2
Google Pixel Watch 2

Google Pixel Watch 2 India launch date announced

 

 

Google Pixel Watch 2 :జనరేషన్ మారినకొద్ది జనాలు కూడా మారిపోతున్నారు. మొన్నటి వరకు ప్రతి ఒక్కరు మొబైల్ కొనేవారు… ఇక ఇప్పుడు స్మార్ట్ వాచ్ ల కాలం వచ్చేసింది. ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరి చేతికి స్మార్ట్ వాచ్ కచ్చితంగా ఉంటుంది. పేద ధనిక అనే తేడా లేకుండా వారి స్థాయికి తగ్గట్టుగా స్మార్ట్ వాచ్లను వాడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే గూగుల్ సంస్థ నుంచి సరికొత్త స్మార్ట్ ఫోన్స్ వచ్చేస్తున్నాయి.

Google Pixel Watch 2
Google Pixel Watch 2

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ సంస్థ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే అలాంటి గూగుల్ నుంచి ఎలాంటి వస్తువు వచ్చినా జనాలు కొనేందుకు ఆసక్తి చూపిస్తారు. అయితే గూగుల్ పిక్సెల్ వాచ్ 2 లాంచ్ చేసేందుకు గూగుల్ సిద్ధమైంది. అక్టోబర్ 4వ తేదీన అంటే ఎల్లుండి గూగుల్ పిక్సెల్ ఈవెంట్ లో ఈ వాచ్ ప్రపంచం ముందుకు రానుంది అన్నమాట. మరి ఈ వాచ్ ఫీచర్స్ ఒకసారి పరిశీలిద్దాం.

వాచ్ డిజైన్

పిక్సెల్ వాచ్ 2… అచ్చం ఫస్ట్ జనరేషన్ మోడల్ లాగే ఉంటుంది. ఈ గాడ్జెట్ 100% అల్యూమినియంతో తయారు చేశారు. వాచ్ డిస్ప్లే 384 * 384 రిజల్యూషన్ కలిగి ఉంటుంది.

అడ్వాన్స్ డ్ ప్రాసెసర్ & battery 

ఈ పిక్సెల్ వాచ్ 2…Qualcomm SWS5100 Soc ప్రొసెసర్‌ తో పనిచేస్తుంది. 2 GB RAM ఉంటుంది. గూగుల్‌ పిక్సెల్ వాచ్ 2 ( Google Pixel Watch 2 ) బ్యాటర్‌ 306 mAh battery తో ఉంటుందని సమాచారం.