Upi transaction in pending:

Upi transaction: ఈరోజుల్లో క్యాష్ ట్రాన్సాక్షన్స్ బాగా తగ్గిపోయాయి. ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ పేమెంట్స్ (online payments) చేస్తున్నారు. యూపీఐ ద్వారా చాలా మంది ఈ రోజుల్లో పేమెంట్లు చేస్తున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం కొన్నా కూడా యూపీఐ (Upi transaction) ద్వారానే డబ్బులు ని కడుతున్నారు ఇదివరకు క్యాష్ తీసుకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఒక ఫోన్ ఉంటే సరిపోతుంది బిల్లు కట్టడానికైనా లేదంటే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలన్నా ఫోన్ ఉంటే చాలు ఇంకేమీ అక్కర్లేదు.
అయితే యూపీఐ ద్వారా పేమెంట్లు చేయడంలో ఇంచుమించు మనకు ఎలాంటి సమస్యలు రావు సర్వర్ డౌన్ అయ్యి అప్పుడప్పుడు ఏదైనా తేడా కొట్టొచ్చు. సర్వర్ డౌన్ అయ్యి పేమెంట్ ఇటు అవ్వకుండా అటు అవ్వకుండా మధ్యలో ఆగిపోతుంది అలాంటప్పుడు మనం టెన్షన్ పడుతూ ఉంటాం. కానీ అలాంటప్పుడు అసలు వర్రీ అవ్వకండి చేతులు డబ్బులు లేకపోయినా సరే మీరు ఇబ్బంది పడక్కర్లేదు ఒకసారి డబ్బులు బ్యాంక్ అకౌంట్ నుండి కట్ అయిపోతుంది. కానీ మనం పంపే వ్యక్తికి ఆ డబ్బులు వెళ్ళవు.
అలా అయినప్పుడు టెన్షన్ పడకుండా ఇలా చేయండి. UPI లావాదేవీల ద్వారా ఒకేసారి రూ. 1 లక్ష దాకానే పంపడానికి అవుతుంది. లక్ష రూపాయల పరిమితిని దాటినా లేదా 10 UPI లావాదేవీలు చేసినా డబ్బులు వెళ్లవు. బ్యాంక్ సర్వర్ బిజీ గా ఉండడం వలన డబ్బులు పంపడానికి అవ్వదు.
డబ్బు పంపే ముందు రిసీవర్ బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్‌ను చెక్ చేసుకోవాలి కూడా. ఒకవేళ మీ అకౌంట్ నుండి అమౌంట్ కట్ అయ్యి.. రిసీవర్ కి వెళ్లకపోతే మీకు మనీ రిఫండ్ వస్తుంది. గరిష్టంగా రెండు బిజినెస్ వర్కింగ్ డేస్‌లో వచ్చేస్తాయి.