Business Plan under Rs.10,000:

Business Plan: ఏదైనా మంచి బిజినెస్ ప్లాన్ (business plan) కోసం చూస్తున్నట్లయితే.. ఈ బిజినెస్ ఐడియా ని చూడండి ఈ ప్లాన్ బాగా వర్క్ అవుట్ అవుతుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని పొందాలని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ బిజినెస్ ని ఫాలో అవ్వచ్చు. అధిక లాభాలు వస్తాయి దీని కోసం మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. పైగా మీకు ఎక్కువ స్కిల్స్ కూడా అక్కర్లేదు వంట చేయడంలో మంచి నైపుణ్యం ఉంటే సరిపోతుంది. మంచి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేయొచ్చు. రుచికరమైన వంటకాలను ప్రపంచం తో పంచుకోవచ్చు.
వంట ప్రాసెస్ ని వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని బాగా ప్రమోట్ చేసుకున్నట్లయితే మంచిగా రెవెన్యూ వస్తుంది. ఈమధ్య జనాల కి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ ఎక్కువయింది. కాబట్టి మీరు మంచి ఆరోగ్యకరమైన రెసిపీస్ ని పరిచయం చేయవచ్చు. ఫిట్నెస్ కోసం చాలామంది ఖర్చు చేస్తున్నారు అయితే కావాలంటే మీరు ఆన్లైన్ ఫిట్నెస్ ట్రైనర్ గా కూడా మారొచ్చు.

ట్రైనర్లకు ఈ రోజుల్లో డిమాండ్ బాగా ఉంది ఈ బిజినెస్ ని కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు యోగా కూడా చాలామంది చేస్తున్నారు. ఆరోగ్యంగా ఉండడానికి యోగా చేస్తున్నారు ఇంట్లో లేదంటే కమ్యూనిటీ సెంటర్లో యోగాసనాలు నేర్పి మీరు మంచిగా డబ్బులు సంపాదించుకోవచ్చు.
ఎలాంటి పెట్టుబడి పెట్టక్కర్లేదు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. మీకు వంట చేయడం బాగా వచ్చి ఉంటే టిఫిన్స్ సర్వీస్ కూడా బాగుంటుంది. ఈ రోజుల్లో ఇంటి వంటలకి డిమాండ్ ఎక్కువ ఉంది. టిఫిన్ సర్వీస్ పచ్చళ్ళు లేదంటే లంచ్ బాక్స్ లో ప్యాక్ చేసి ఇవ్వడం వంటివి చేయొచ్చు ఎక్కువ పెట్టుబడి పెట్టక్కర్లేదు మంచిగా లాభాలు ఈ బిజినెస్ తీసుకొస్తాయి.