Gold And Silver Rates On oct 5th
Gold Rates : బంగారం కొనుగోలు చేసే వారికి మరోసారి అదిరిపోయే శుభవార్త అందింది. దాదాపు పది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు… ఇవాళ కూడా తగ్గుముఖం పడ్డాయి. బంగారం ధరలతో పాటు… వెండి ధరలు కూడా భారీగా తగ్గు ముఖం పట్టాయి.

మన ఇండియాలో బంగారం కు ఉన్న విలువ ఇంకో వస్తువుకు లేదన్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి చిన్న పండుగకు బంగారం కొనుగోలు చేసేందుకు మన జనాలు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలో బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
ఇది ఇలా ఉండగా హైదరాబాద్ మహానగరంలో తగ్గిన బంగారం మరియు వెండి ధరల వివరాల ప్రకారం…. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 57,530 గా నమోదు అయింది.
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర ( Gold Rates ) 52, 590 గా నమోదు అయింది. అటు వెండి ధరలు కూడా కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో కిలో వెండి ధర 400 రూపాయలు తగ్గి 73,100 గా నమోదు అయింది.