Business ideas under 10,000:

Business ideas under 10,000: ఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుండి సంప్రదించాలని తేలికగా సంపాదించాలని వ్యాపారం మొదలు పెట్టాలని… ఇలా రకరకాల ఆలోచనలతో ఉన్నారు. మీరు కూడా బిజినెస్ వైపు దృష్టి పెట్టాలనుకుంటున్నారా..? పదివేల లోపు మంచి వ్యాపారం ఏదైనా చేయాలని అనుకుంటున్నారా అయితే ఈ ఐడియా మీ కోసం. మంచిగా అదిరే లాభాలని ఇలా పొందడానికి అవుతుంది. పదివేల రూపాయలతోనే మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయవచ్చు పైగా ఎక్కువగా మీరు రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు.
Business ideas under 10,000 టిఫిన్ సర్వీస్ తో మంచిగా లాభాలని పొందవచ్చు. ఈ రోజుల్లో పురుషులు స్త్రీలు కూడా వ్యాపారాలు చేస్తున్నారు. ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళు వేరే ఊర్లలో ఉండాల్సి వస్తుంది. బ్రేక్ఫాస్ట్ కి ఇబ్బంది అవుతుంది. అందుకని మీరు టిఫిన్ సర్వీస్ ని స్టార్ట్ చేసి క్యాష్ చేసుకోవచ్చు. బాగా లాభం కూడా వస్తుంది.

పదివేల రూపాయలు కంటే తక్కువ డబ్బులతో వ్యాపారం చేయాలనుకుంటే ఊరగాయల బిజినెస్ కూడా బాగుంటుంది. పచ్చళ్ళకి డిమాండ్ బాగా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. కాబట్టి క్యాష్ చేసుకోవచ్చు. ఎలాంటి పెట్టుబడి లేకుండా మీరు యూట్యూబ్ ఛానల్ ని మొదలుపెట్టి మంచిగా లాభాలని పొందవచ్చు. అలానే పెళ్లిళ్లలో గోరింటాకులు పెట్టడం వంటివి చూస్తే కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాన్ని పొందవచ్చు.
పెళ్లిళ్లు మొదలైన ఫంక్షన్లకి ఒక చేతికి మెహందీ పెట్టడానికి రెండు వేల వరకు తీసుకుంటున్నారు. ఈ టాలెంట్ కనుక మీకు ఉంటే కచ్చితంగా దీనిని మీరు క్యాష్ చేసుకోవచ్చు. అలానే ఒక మంచి టీ స్టాల్ ని తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేసి అదిరే లాభాలు పొందవచ్చు. మరి ఇక ఈ బిజినెస్ ఐడియాస్ ని చూశారు కదా మీకు ఏది సెట్ అవుతుంది ఏది బాగుంటుంది అనుకుంటే దానిని మొదలుపెట్టి అదిరే లాభాలని పొందండి.