Call forwarding: కాల్ ఫార్వార్డింగ్ చెయ్యాలా..? ఇలా సుంపుల్ గా చేయండి..!!

Call forwarding
Call forwarding

Simple steps for Call forwarding:

Call forwarding
Call forwarding

Call forwarding: ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉంటే అన్ని పనులు కూడా ఈజీ అయిపోతున్నాయి సాధారణంగా చాలామంది వేరే కాల్ లో మాట్లాడుతున్నప్పుడు అదే నెంబర్ కి ఇంకో ముఖ్యమైన కాల్ వస్తే దానిని మిస్ అయిపోతూ ఉంటారు. మొబైల్ బ్యాటరీ డెడ్ అయ్యే పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక్కోసారి ఇంపార్టెంట్ కాల్స్ కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇటువంటి టైం లో కావాల్సినవి మిస్ అవ్వకుండా ఉండడానికి మొబైల్ నెట్వర్క్ లో కాల్ ఫార్వర్డ్ సౌకర్యాన్ని ఇస్తున్నాయి.

అలానే డీ ఆక్టివేట్ చేసుకునే అవకాశమును కూడా కల్పిస్తున్నాయి ఈ కాల్ ఫార్వర్డ్ Call forwarding డీఆక్టివేట్ ఫీచర్ ని పొందడానికి వివిధ సిమ్స్ కి వివిధ కోట్లు ఉన్నాయి. ఇంతకీ ఆ కోడ్లు ఏంటి ఎలా సెట్ చేసుకోవాలి..? ఇప్పుడు చూద్దాం. జియో ఫోన్ వాడేవాళ్లు ఎలా కాల్ ఫార్వర్డ్ ఆక్టివేట్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. మీరు జియో వాడుతున్నట్లయితే మీ ఫోన్లో ఫోన్ యాప్ ని ఓపెన్ చేయండి తర్వాత *401* నొక్కి మీ ఫోన్ నెంబర్ ని డయల్ చేయాలి. ఇక్కడ ఏ ఫోన్ కి కావాలనుకుంటున్నారో ఆ నెంబర్ ని నొక్కి తర్వాత కాల్ బటన్ మీద నొక్కాలి.

తర్వాత మీ నెంబర్ కి కాల్ ఫార్వర్డ్ యాక్టివ్ అయిపోతుంది. అదే ఒకవేళ మీరు మరొక కాల్ లో బిజీగా ఉన్నట్లయితే *405* నొక్కి నొక్కి పది అంకెలని నొక్కేసి డైల్ చేయాలి. ఫార్వర్డింగ్ మొబైల్ నెంబర్ ను నిర్ధారించడానికి కాల్ ఐకాన్ ని ఎంచుకోవాలి. మీరు కాల్ ఎంచుకో లేనప్పుడు ఫోన్ యాప్ ని తెరిచి *403* నొక్కి పది అంకెల్ని డయల్ చేయాలి ఇలా కాల్ ఫార్వర్డ్ కోడ్ ఆక్టివేట్ అవుతుంది.

మీ ఫోన్ అందుబాటులో లేనప్పుడు కాల్ ని ఫార్వర్డ్ చేయడానికి ఫోన్ యాప్ ని తెరిచి *409* నొక్కి పది అంకెలని ఎంటర్ చేయాలి అంతే మీ ఫార్వర్డ్ కోడ్ ఆక్టివేట్ అవుతుంది అలానే ఎయిర్టెల్ కి వేరుగా బిఎస్ఎన్ఎల్ కి వేరుగా కోడ్స్ ఉంటాయి మీ సిమ్ములని బట్టి మీరు డయల్ చేయాల్సి ఉంటుంది.